లగడపాటిని అరెస్టు చేయాలి: తెలంగాణ కాంగ్రెసు

కాగా, తమ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎబివిపి, ఇతర పార్టీల కార్యకర్తలు ఆందోళనలు చేయడం సరి కాదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తాము ఉద్యమంలోనే ఉన్నామని ఆయన శుక్రవారం విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండా తామే స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడానికి ముందుకు వచ్చామని, కాంగ్రెసు నాయకులు కూడా తమ లాగానే రాజీనామాలు చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా రేపటి చలో ఆసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం విషయంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని ఆయన కోరారు. మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితర తెలంగాణ నాయకులతో కలిసి ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications