హైదరాబాద్: తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటానని డైలు నుంచి విడుదలైన మావోయిస్టు మాజీ నేత కోనాపురం ఐలయ్య అలియాస్ సాంబశివుడు చెప్పారు. రాజ్యాంగబద్దంగా, చట్టబద్దంగా శాంతియుతంగా తాను జరిగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తాను పాల్గొంటానని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సాంబశివుడిపై ఉన్న మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఒక కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
సాంబశివుడు 2009లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆ మధ్య ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆయనపై తీవ్రమైన కేసులున్నాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. వాటిలో మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఒక కేసును కోర్టు కొట్టేసింది. దీంతో జైలు నుంచి ఆయన విడుదల కాగలిగారు. సాంబశివుడిది నల్లగొండ జిల్లా.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి