ఘనంగా నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం..
బండ్ల గణేష్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
అలానే ఆ తర్వాత నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించారు. రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారగా.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. 2015లో వచ్చిన 'టెంపర్' చిత్రం తర్వాత సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది.

గణేష్ కుమార్తె జనని బండ్ల వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది. సూర్యతేజ కుటుంబానికి రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పలు వ్యాపారాల్లో బలమైన నేపథ్యం ఉందని సమాచారం. ఈ క్రమంలో ఈరోజు ( మే 3, 2026 ) వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి విచ్చేసి సందడి చేశారు.
అలానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బ్రహ్మానందం.. కోన వెంకట్, నటుడు శివాజీ, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. దీంతో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు రీసెంట్ గానే "BG Blockbusters" అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి కూడా ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ బ్యానర్ పై ఒక ప్రాజెక్ట్ ఖరారైందని.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు.
చిరంజీవి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న బండ్ల ఫ్యామిలీ #Chiranjeevi #BandlaGanesh #JananiBandla #SuryaTejaChilukuri #ReelTalk #OITelugu pic.twitter.com/ZKs03nWfHO
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2026












Click it and Unblock the Notifications