ఒయులో ఫోర్స్: హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

Supreme Court
న్యూఢిల్లీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మోహరించిన బలగాలను ఉపసంహరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ఈ నెల 23వ తేదీన తదుపరి విచారణ చేపట్టే వరకు స్టే అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని, అందువల్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇతర బలగాలు ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

ఉస్మానియాలో బలగాల మోహరింపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను లిఖిత పూర్వరంగా తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలగాల తరలింపు, రోజువారీ కార్యకలాపాలపై రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి రోజువారీగా సమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల పట్ల బలగాలు అనుచితంగా ప్రవర్తించకూడదని, సంయమనం పాటించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+