బడ్జెట్ పై పెదవి విరిచిన చంద్రబాబు

రాష్ట్ర పరిస్థితి లాగానే బడ్జెట్ కూడా అంతుబట్టకుండా ఉందని ఆయన అన్నారు. జీతాలకు, చెల్లింపులకు ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని ఆయన అన్నారు. అప్పులు పెరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ లో డిఎస్సీ నిర్వహణ ఊసు లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. బడ్జెట్ కేటాయింపులు చూస్తే 50 ఏళ్లయినా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావని ఆయన అన్నారు. గతంలో హామీ ఇచ్చిన 30 కిలోల రేషన్ బియ్యం సరఫరా, రైతులకు 9 గంటల విద్యుత్తు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదని ఆయన విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై, ముస్లిం రిజర్వేషన్లపై రోశయ్య తన బడ్జెట్ లో ప్రతిపాదించకపోవడాన్ని ఆయన నిరసించారు. ధరల పెరుగుదల నియంత్రణ గురించి రోశయ్య మాట్లాడకపోవడం విచారకరమని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications