అసెంబ్లీ ముట్టడికి భారీ బందోబస్తు

జిల్లాల నుంచి ఇప్పటికే విద్యార్థులు హైదరాబాదుకు చేరుకున్నట్లు సమాచారం. దాదాపు పది వేల మంది విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య శాసనసభలో శనివారం బడ్జెట్ ను ప్రతిపాదించనున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆసెంబ్లీకి వెళ్లే దారుల్లో ఎక్కడా ట్రాఫిక్ ను అనుమతించడం లేదు. విద్యార్థులు అడ్డుకుంటారనే అనుమానంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాహనం మార్చి వేరే కారులో శాసనసభకు చేరుకున్నారు. హైదరాబాదులోని కనీవినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఉంది.












Click it and Unblock the Notifications