లక్షా 13 వేల కోట్లతో రోశయ్య బడ్జెట్

రెవెన్యూ ఆదాయం రూ. 3,548 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. మొత్తం రెవెన్యూ అంచనాను రూ. 1,13,675 కోట్లుగా చెప్పారు. 2010 - 2011లో వృద్ధి రేటు 7.17 శాతం ఉండగలదని రోశయ్య అంచనా వేశారు. రెవెన్యూ నిధుల్లో కేంద్ర పన్నుల వాటా 14,505 కోట్ల రూపాయలు, కేంద్ర గ్రాంట్లు రూ. 13,441 కోట్లు ఉండగలదని అంచనా వేశారు. మూలధన వసూలు రూ. 23,027 కోట్లు ఉండగలదని ఆయన చెప్పారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి కూడా రోశయ్య తన బడ్జెట్ కేటాయింపులు జరిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాల్లో ఈ నిధులను వినియోగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications