ఉన్నంతలో మంచి బడ్జెట్ పెట్టా: సిఎం

ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక మాంద్యం ప్రభావం మనపై కూడా పడిందని ఆయన చెప్పారు. ఈ స్థితిలో ఏ విధమైన బడ్జెట్ ప్రతిపాదించవలసి వస్తుందోనని భయపడుతూ వచ్చానని, ఆయితే తాము పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్ల మంచి బడ్జెట్ నే ప్రతిపాదించానని ఆయన చెప్పారు. ద్రవ్యలోటు మించకుండా జాగ్రత్త పడ్డామని ఆయన చెప్పారు. పెట్టుబడి వ్యయంలో కోత పెట్టలేదని ఆయన అన్నారు. బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఏ ప్రాంతానికీ ఇబ్బంది కలగకుండా చూశానని, ప్రాంతాన్ని బట్టి నిధుల కేటాయింపు ఉండదనీ పథకాలను బట్టే ఉంటుందనీ ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవాదులను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications