ర్యాలీని అడ్డుకున్న పోలీసులు: తోపులాట

హైదరాబాదుకు వస్తున్న విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రైళ్లను ఆపేసి విద్యార్థులను వెనక్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాదు బయలుదేరిన విద్యార్థులను పోలీసులు నల్లగొండ జిల్లా భువనగిరి వద్ద అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కూడా పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని రామంతపూర్, అంబర్ పేట ప్రాంతాల నుంచి విద్యార్థులు అసెంబ్లీ వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సిటీ కశాశాల వద్ద విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్, తదితరులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కొంత మంది విద్యార్థులు విద్యానగర్ వద్ద బారికేడ్లను దాటి ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు వెనక్కి పంపించారు. పోలీసులు ఏ విధమైన రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు. విద్యార్థులు కూడా సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. శాసనసభ వరకు వెళ్లడం సాధ్యం కాదని, అసెంబ్లీ ముట్టడి విజయం సాధించినట్లేనని, దీంతో విరమించుకుని విద్యార్థులు వెనక్కి వెళ్లాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. జాతీయ జెండాలను ధరించి విద్యార్థులు ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications