విధ్వంసానికి దిగిన తెలంగాణ విద్యార్థులు

Telangana
హైదరాబాద్: సిరిపురం యాదయ్య అనే విద్యార్థి ఆత్మాహుతి యత్నంతో ఆగ్రహించిన తెలంగాణ విద్యార్థులు విధ్వంసానికి దిగారు. యాదయ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం అందగానే విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చారు. తిరిగి శాసనసభను ముట్టడించడానికి ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని జామై ఉస్మానియాలో విద్యార్థులు మూడు బస్సులకు నిప్పంటించారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. సికింద్రాబాదులోని పిజి కళాశాల విద్యార్థులు రోడ్డు మీదికి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. యాదయ్య ఆత్మహత్య నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఉస్మానియా జెఎసి నాయకులు సమావేశమయ్యారు. కూకట్ పల్లిలోని జెఎన్ టియు విద్యార్థులు ధర్నాకు దిగారు.

ఆంధ్ర పెట్టుబడిదారుల ఆస్తుల విధ్వంసానికి దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థి ఆత్మహత్యపై తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు కళ్లు మూసుకుని చోద్యం చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోస్తాంధ్ర నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల వల్లనే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+