వర్సిటీని నుంచి వెళ్లొద్దు: విసి సూచన

Tirupathi Rao
హైదరాబాద్: విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లవద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరుపతిరావు తెలంగాణ విద్యార్థులకు సూచించారు. పీస్ కమిటీ సభ్యులు చుక్కా రామయ్య, నాగేశ్వర్, లక్ష్మణ్ తదితరులు విద్యార్థులతో మాట్లాడారని, శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీ ముట్టడికి ఉస్మానియా నుంచి విద్యార్థులు బయలుదేరిన నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రజాస్వామ్య పద్థతిలో, చట్టబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చునని, విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్తే 144 సెక్షన్ ఉందని, అందువల్ల విద్యార్థులు బయటకు వెళ్లకూడదని ఆయన అన్నారు.

చట్టాన్ని అతిక్రమించకూడదని తాము విద్యార్థులకు చెప్పామని ఆయన అన్నారు. విద్యార్థులు సహకరిస్తామని తమతో చెప్పారని ఆయన అన్నారు. పోలీసులు కవ్వింపు చర్యలకు దిగవద్దని, లాఠీచార్జీ వంటి చర్యలకు పాల్పడకూడదని ఆయన అన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన అన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని, విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. పిల్లలకు ఏమీ జరగకూడదనేదే తమ అభిమతమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+