పద్మనాభానికి ప్రముఖుల నివాళి

నవ్వడం, నవ్వించడం మాత్రమే తెలిసిన ప్రముఖ హాస్యనటులు పద్మనాభం (79) శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించడం అశేష తెలుగు ప్రేక్షకుల్ని, పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. ఆయన చిన్నతనంనుంచి నాటకాలపట్ల ఎక్కువ మక్కువ చూపుతుండేవారు. ఆ మక్కువతోనే ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలని కలలు కంటుండేవారు.
పద్మనాభం పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 20 ఆగస్టు 1931న కడప జిల్లాలోని, పులివెందుల తాలూకలోని సింహాద్రిపురంలో శ్రీమతి శాంతం, బసవరాజు వెంకట శేషయ్య దంపతులకు జన్మించిన పద్మనాభం నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా పలు విభాగాలలో విశిష్ట ఖ్యాతిని సంపాదించారు. దాదాపు 80మంది దర్శకుల వద్ద 400లకు పైగా చిత్రాల్లో కామెడీ క్యారెక్టర్స్‌తో బాటు పలు రకా పాత్రలను పోషించారు.












Click it and Unblock the Notifications