న్యూఢిల్లీ: సోషలిస్టు ఉద్యమకారుడు, రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కనిపించకుండా పోయారు. తీవ్రమైన మతిమరపునకు కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇప్పటికే జ్ఞాపకశక్తిని దాదాపు పూర్తిగా కోల్పోయారు. ఫెర్నాండెజ్ నుంచి విడిపోయిన ఆయన భార్య లీల కబీర్, కుమారుడు సియాన్ కలసి ఆయన్ను వైద్య చికిత్స పేరిట గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఆయన స్నేహితులు ఆరోపిస్తున్నారు.
ఆయన వారసత్వ హక్కుపై కుటుంబంలో తలెత్తిన వివాదాలే ఈ సంఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ అదృశ్యమయ్యారన్న మీడియా కథనాల్లో వాస్తవం లేదని లీల పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ మొదట రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నప్పటికీ ఎన్డీయే హయాంలో రక్షణ మంత్రిగా కోట్లాది రూపాయలు కమిషన్ గా పొందినట్టు వార్తా కథనాలు వచ్చాయి. తెహెల్కా డాట్ కాం పదేళ్ళ క్రితం ఆ విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి