Video: పాక్ గడ్డపై భారత ప్రళయం! ప్రధాని పవర్‌ఫుల్ మెసేజ్
"మేము దేనినీ మరిచిపోము.. ఎవరినీ క్షమించము!"- భారత వాయుసేన (IAF) విడుదల చేసిన ఈ ఒక్క నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడి రక్తాన్ని ఉరకలెత్తిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం, మే 7, 2025న పహల్‌గామ్‌లో 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు భారత సాయుధ దళాలు ఇచ్చిన గట్టి సమాధానం 'ఆపరేషన్ సింధూర్'. ఈ చారిత్రాత్మక సైనిక చర్యకు నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా, దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుల వరకు యావత్ భారతావని మన సైన్యానికి సెల్యూట్ చేస్తోంది.
పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత్ తన సహనాన్ని వీడి, ఉగ్రవాద మూలాలను పెకిలించేందుకు నడుం బిగించింది. నిశిత ప్రణాళిక, అధునాతన ఇంటెలిజెన్స్ సమాచారంతో భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. శత్రువు ఊహించని రీతిలో నియంత్రణ రేఖ (LoC) దాటి పాకిస్థాన్ లోపలికి చొరబడి, తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను మన దళాలు తుత్తునియలు చేశాయి. పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా, కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి, భారత సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

వైమానిక దళం గర్జన.. నౌకాదళం 'ఉక్కు' పట్టు!
ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన తన వీరత్వాన్ని ప్రదర్శించింది. పాక్ లోపల ఉన్న నూర్ ఖాన్, రహీమ్యార్ ఖాన్ ఎయిర్ బేస్‌ల సమీపంలోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ యుద్ధ విమానాలు నిప్పులు కురిపించాయి. శత్రువుల డ్రోన్ దాడులను తిప్పికొట్టడంలో 'ఆకాష్' క్షిపణులు, ఐసీసీఎస్ (ICCS) వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. మరోవైపు, సముద్ర మార్గంలో పాక్ ఎటువంటి సాహసం చేయకుండా ఉండేందుకు భారత నౌకాదళం 'క్యారియర్ బ్యాటిల్ గ్రూప్'ను మోహరించి మక్రాన్ తీరాన్ని దిగ్బంధించింది. అటు బీఎస్ఎఫ్ దళాలు సైతం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుని ఉగ్రవాదులను హతమార్చాయి.
Operation Sindoor
— Indian Air Force (@IAF_MCC) May 6, 2026
Justice served.
Precise in action, eternal in memory—Operation Sindoor continues.
India forgets nothing-India forgives nothing.#operation #Sindoor #operationsindoor #IAF @PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi… pic.twitter.com/GWvnY9Udjl
ప్రధాని మోదీ దృఢ సంకల్పం: 'ఎక్స్' వేదికగా నివాళి
ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా (X) డీపీని 'ఆపరేషన్ సింధూర్' లోగోగా మార్చి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. "మన సైన్యం చూపిన అసమాన ధైర్యం, సంకల్పం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో మా సంకల్పం అచంచలం" అని మోదీ ఉద్ఘాటించారు. రక్షణ రంగంలో మనం సాధించిన స్వావలంబనే నేడు జాతీయ భద్రతకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.
ఎక్స్ వేదికగా ప్రధాని, "సంవత్సరం క్రితం, మన సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్'లో అసమాన ధైర్యం, ఖచ్చితత్వం, సంకల్పాన్ని ప్రదర్శించాయి. పహల్గాం లో అమాయకులపై దాడి చేసిన వారికి తగిన సమాధానం ఇచ్చాయి. దేశం మన బలగాల పరాక్రమాన్ని శ్లాఘిస్తుంది. 'ఆపరేషన్ సింధూర్' ఉగ్రవాదంపై భారత్ గట్టి ప్రతిస్పందనను, జాతీయ భద్రతకు నిబద్ధతను ప్రతిబింబించింది" అని రాశారు.
నేడు గగనతలంలో ఐఏఎఫ్ యుద్ధ విమానాల హోరు, సరిహద్దుల్లో సైనికుల పహారా.. భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే వారికి ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి- "ఇది నవ భారతం.. ఇంట్లోకి చొరబడి మరీ కొడుతుంది!"














Click it and Unblock the Notifications