ఆ శాఖలో 18వేల ఉద్యోగాలు.. పండుగ లాంటి వార్త చెప్పిన మంత్రి!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అన్ని శాఖలను బలోపేతం చేయడంతోపాటు, ఉద్యోగాల భర్తీ పైన ఫోకస్ చేస్తోంది. ఇదే ఇదే క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త చెప్పారు.
త్వరలోనే వారికి ఉద్యోగాలు: మంత్రి దామోదర రాజనర్సింహ
త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యా, వైద్య, మహిళా సాధికారత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ అమలు కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... ఉద్యోగాల విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు , వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న బాల సదనాలను, అంగన్వాడీలను కాపాడుకునే గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు . రాష్ట్రంలో అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ, సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.
అంగన్వాడీల ద్వారా న్యూట్రిషన్ ఫుడ్, ఆరోగ్య పరీక్షలు ఫ్రీ
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా గర్భిణీ, బాలింతలకు, 3 నుండి 6 ఏండ్ల పిల్లలకి ఒక పూట సంపూర్ణ భోజనం, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు టేక్ హోమ్ రేషన్ అందించడం చేస్తోందన్నారు. మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడంతోపాటు పోషకాహారం, ఆరోగ్యం , ప్రీ - స్కూలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వారిని కొనియాడిన మంత్రి
గ్రామాలలో ANM లు, అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వీరి సేవలను మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాలసదనం బాలికలతో మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలసదనంలో తక్షణమే ఆర్ఓ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications