వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్ జిల్లాలో బ్లూఫిల్మ్ ల మాఫియా

By Santaram
|
Google Oneindia TeluguNews

Karimnagar Dist
కరీంనగర్: అందమైన అమ్మాయిలు అమాయకంగా సిడీలలో బొమ్మలవుతున్నారు. ప్రేమించిన వాడిని నమ్ముకున్న పాపానికి లోకానికి లోకువవతున్నారు. కరీంనగర్ జిల్లాలో అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని వారితో సాగించే రొమాన్సును రహస్యంగా చిత్రీకరించి అంగట్లో సిడీలుగా అమ్ముకునే ముఠాలు అనేకం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే రాజకీయ నాయకుల వత్తిళ్ళ వల్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

ఇటీవల హుస్నాబాద్‌ మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఓ విద్యార్థినికి సంబంధించిన అశ్లీల చిత్రాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రేమ ముసుగులో ఓ యువకుడు సదరు విద్యార్థినిని పట్టణ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి, స్నేహితుల సహాయంతో రహస్యంగా అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి సిడిలుగా మార్చినట్లు తెలిసింది. వీటిని హుస్నాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో అద్దెకు కూడా తిప్పుతున్నట్లు పలువురు యువకులు పేర్కొన్నారు.

ఇదే గాకుండా కమాన్‌పూర్‌ మండలం కన్నాల గుట్ట వద్ద పలువురు యువతీ, యువకులు బ్లూ ఫిల్మ్‌లు చిత్రీకరిస్తుండగా స్థానికుల కంట పడడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ సంఘటనకు దాదాపు పదిహేను రోజుల ముందు నుంచి ఈ ప్రాంతానికి రాత్రి వేళల్లో ఆటోలు, ఇతర వాహనాల్లో కొంత మంది వచ్చి లైట్లు ఏర్పాటు చేసుకునేవారని స్థానికులు పేర్కొన్నారు. గోదావరిఖని లోని పలు లాడ్జీల్లో గత ఏడాది పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు.

కోల్‌బెల్ట్‌ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ నాయకుని అనుచరులు ఈ బృందంలో ఉండడంతో ఈ తతంగమంతా గోప్యంగానే ఉంచినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలోని పలువురు సెక్స్‌ వర్కర్లతో ఇప్పటికీ బ్లూ ఫిల్ముల చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోల్‌బెల్ట్‌ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న పలువురు ముఠాగా ఏర్పడి ఈ ప్రాంతంలో వ్యభిచారానికి అండదండగా నిలుస్తుండడంతో పాటుగా, జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, హుస్నాబాద్‌, సిరిసిల్ల, కమాన్‌పూర్‌లతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న అశ్లీల దృశ్యాల తతంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోనే నాలుగు వేల మందికి పైగా సెక్స్‌వర్కర్లున్నట్లు ఇటీవల జరిపిన ఓ సర్వేలో వెల్లడవడం, స్థానికులతో చిత్రీకరించిన బ్లూ ఫిల్ముల సిడిలు ఈ ప్రాంతంలో పలు సందర్భాల్లో లభ్యమవడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X