డ్రగ్స్ స్కామ్‌లో సినీ నిర్మాత అరెస్టు

వివరాలు ఇలా ఉన్నాయి - సినిమా పరిశ్రమకు చెందిన ఓ కారులో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్ క్రైమ్, మాదాపూర్ పోలీసులు నిఘా పెట్టారు. రెండు రోజుల కిందట ఏపీ28 సీసీ 4840 నెంబరు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి పెద్దఎత్తున మాదక ద్రవ్యాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు శంభో శివ శంభో సినిమా షూటింగుకు వాడిందని తెలుస్తోంది. సినీ నిర్మాత కె.వెంకటేశ్వరరావు ఈ రాకెట్‌కు సూత్రధారిగా పోలీసులు విచారణలో తేల్చారు. అతని స్నేహితుడు బి. శ్యాంరాజ్‌తో కలిసి ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.
వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు నగదు, ఒక ఇన్నోవా కారు, 22 కేజీల ఈపీఎక్స్ డ్రైన్ (హెరాయిన్) అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ముంబై, ఢిల్లీల్లో డ్రగ్స్ సరఫరా చేసే రాకెట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌లోని కీలక వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మిగతా గ్యాంగు సభ్యుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications