డ్రగ్స్ స్కామ్: అగ్ర నిర్మాతకు లింక్?

K Venkateswara Rao
హైదరాబాద్: హైదరాబాదులోని బయటపడిన మాదక ద్రవ్యాల కుంభకోణంలో మరో ఇద్దరు నిర్మాతల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలంటున్నాయి. ఇందులో ఒక అగ్ర నిర్మాత ఉన్నాడని చెబుతున్నారు. ఈ అగ్ర నేత వివరాలు బయటపెడతానని డ్రగ్స్ స్కామ్ లో పట్టుబడిన చలన చిత్ర నిర్మాత కె. వెంకటేశ్వర రావు (కెవి రావు) అంటున్నాడు. కెవి రావుతో పాటు శ్యాంరాజును మాదక ద్రవ్యాల కుంభకోణంలో అరెస్టు చేసిన విషయాన్ని పోలీసు అధికారులు సోమవారం వెల్లడించారు. కెవి రావు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు మంచి మిత్రుడని తెలుస్తోంది. ఈ మేరకు టీవీ చానెళ్లలో మీడియా కథనాలు ప్రసారమవుతున్నాయి. కాగా, బాలనటుడి స్థాయి నుంచి హీరోగా ఎదిగిన ఒక ప్రముఖ నటుడి తమ్ముడికి కూడా ఈ కుంభకోణంతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కెవి రావుకు ఎవరు పెట్టుబడి పెట్టారు, అతను ఎక్కడెక్కడ మాదక ద్రవ్యాలు అందజేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్ తో కన్నడ సినీ ప్రముఖులకు కూడా సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తరలించడానికి ఉద్దేశించిన మాదక ద్రవ్యాలు ఉన్న కారును పోలీసులు హైదరాబాదులోని బంజారాహిల్స్ లో పట్టుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాలు హైదరాబాదులోని కొన్ని పబ్ లకు కూడా సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కెవి రావు కారు నుంచి 25 కిలోల మాదకద్రవ్యాలను, 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కెవి రావుకు ఇతర రంగాల ప్రముఖులతో ఉన్న పరిచయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కెవి తరుచూ దుబాయ్ కి వెళ్లి వస్తుండేవాడని, అందుకు గల కారణాలను కూడా శోధిస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇంత పెద్ద యెత్తున హైదరాబాదులో మాదక ద్రవ్యాలు పట్టుబట్టడం ఇదే మొదటిసారి. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని భావిస్తున్నారు. కెవి రావు మాదకద్రవ్యాల రవాణాకు వాడిన కారును ఇటీవలి శంభో శివ శంభో సినిమా షూటింగులో వాడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+