తెలంగాణకు శాపం ఈ సినిమాలు: హరగోపాల్

Karimnagar Dist
కరీంనగర్‌: సినిమాల కారణంగానే తెలంగాణ ఉద్యమ చైతన్యం విషతుల్యంగా మారిందని మానవ హక్కుల వేదిక కార్యదర్శి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. మంకమ్మతోటలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం రాత్రి కాకతీయ ప్రవాస భారతీయుల సంఘం ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1960 వరకు ఆదర్శంగా కని పించిన సినీ హీరో పాత్రలు తెలంగాణ మొదటి దశ ఉద్యమం తరువాత దిగజారిపోయాయన్నారు.

ఉత్పాదక రంగాల నుంచి పెట్టుబడులు సినీ పరిశ్రమలకు తరలిపోవడం మొదలై స్త్రీ పాత్రల ను భోగవస్తువులుగా చిత్రీకరించే స్థాయికి దిగజారాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చిత్రపరిశ్రమ తరలిపోతుందనే వాదన సరికాదని తెలిపారు. ఉద్యమ పరంపరలో అదుర్స్‌ సిని మాను నిలిపివేయాలన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటనను రాష్ట్రంలోని అ న్ని రాజకీయ పార్టీల నేతలు తప్పుపట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సినిమా రంగం రాజకీయాలను శాసిస్తోందనడానికి ఇది నిదర్శనమని వెల్లడించారు. సినిమా ప్రభావం నుంచి తెలంగాణ ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+