మాపై అపోహలు వద్దు: దుగ్గల్

పరిస్థితిపై అవగాహన కోసం మార్చి నెలాఖరు నుంచి జూన్ నెలాఖరు వరకు సంప్రదింపులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వివిధ వర్గాలనుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించి, సంప్రదింపుల తర్వాత అధ్యయనం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. విధివిధానాల్లో స్పష్టత ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ అందమైన నగరం, తెలంగాణ రాష్ట్ర అద్భుతమైందని ఆయన అన్నారు. ఒక కమిటీని నియమించిన తర్వాత పనిలోకి ఇంత వేగంగా దిగింది తమ కమిటీయేనని ఆయన అన్నారు. తాను తెలుగు నేర్చుకుంటున్నానని, మరోసారి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications