హైదరాబాద్: కృష్ణా జిల్లా జగ్గంపేట నీటిపారుదల శాఖ అధికారి, పోలవరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామకృష్ణ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అతనికి మూడు కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు ఎసిబి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జగ్గంపేటలోని ఆయన కార్యాలయంలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన నివాసాలపై ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వెంకటకృష్ణ అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. కాగా, ఆస్తులన్నీ తన తండ్రితాతలు సంపాదించినవేనని వెంకటరామకృష్ణ వాదిస్తున్నాడు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి