ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ: తెరాసకు చెక్

ఉప ఎన్నికలు వచ్చేనాటికి ఏమైనా జరగవచ్చునని, ఇంకా చాలా సమయం ఉందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు రానీయండి చూద్దామని ఆయన మీడియా ప్రతినిధుల వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఉప ఎన్నికలు వచ్చేనాటికి ఏదైనా సాధ్యమని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మకమైందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. మీడియాపై చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. మీడియాపై విమర్శలు చేయడం సరి కాదని, అధికారంలో ఉన్నవారు మీడియా పట్ల సంయమనం పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications