మహబూబ్‌నగర్: కలుషిత ఆహారం తిని 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సర్వ మండలం కస్తూర్భా రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థినులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విధ్యార్ధులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమచారం. పిల్లల తల్లి తండ్రుల స్కూల్ వద్ద, ఆసుపత్రి వద్ద చేరి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించుకుంటున్నారు. యాజమాన్యం దీనిపై ప్రస్తుతం నోరు విప్పటం లేదు. త్వరలో దీనిపై విచారణ జరుపుతామని అక్కడడికి వచ్చిన ప్రభుత్వాధికారులు చెప్తున్నారు.