పెట్రో ధరలపై ప్రణబ్ కు సోనియా మద్దతు

Sonia Gandhi
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుపై యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి మద్దతుగా నిలిచారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు పెట్రో ధరల పెంపుపై తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న సమయంలో ఆమె ప్రణబ్ ను వెనకేసుకొచ్చారు. తన బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ద్రవ్యలోటును తగ్గించడానికి ప్రణబ్ ముఖర్జీ అద్భుతమైన బడ్జెట్ ను సమర్పించారని ఆమె అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెట్రో ధరల పెంపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యాల ధరల నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆమె చెప్పారు. ఆమె కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు.

ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేయడంపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచి పని కాదని ఆమె అన్నారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటే అలా ప్రవర్తించబోమని ఆమె అన్నారు. మహిళా బిల్లు తాము ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+