హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తన వైఖరిని సమర్థించుకున్నారు. జై ఆంధ్ర నినాదం వల్ల లాభం జరిగితే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందని, నష్టం జరిగితే తానొక్కడినే పోతానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. లక్ష్యం లేని వ్యక్తిగా జీవించడం వృధా అని ఆయన అన్నారు.
ఒక్క మాటకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. అలా అయితే తన కన్నా బాగా మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.