చిలుకూరు గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

చిలుకూరు ఆలయం అభివృద్ధికి నిధులను అడిగితే ఇవ్వటానికి ప్రతి శాఖామంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి నిధులను రాబట్టి హిమాయత్‌నగర్ నుంచి ఆలయం వరకు నాలుగులైన్ల రోడ్డు, బ్యాంకు, పార్కుల అభివృద్ధి, మ రిన్ని మూత్రశాలలు, మురుగునీటి పరిశుద్ధి కేంద్రం లాంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయిం చామన్నారు.
దేవాలయం వద్ద పార్కింగ్ ఏర్పాటుచేయుటకు అనుమతి కోరుతూ పూజారులు పెట్టుకున్న దరఖాస్తును పంచాయతీ తిరస్కరించిందని సర్పంచ్ తెలిపారు. ఇంటలిజెన్స్ నివేదికప్రకారంగా జనసముదాయానికి వందమీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్నపార్కింగ్ అందుకు విరుద్ధంగా ఉన్నందున చట్టబద్దత కల్పించలేమని నోటీసు రూపంలో తెలిపామన్నారు.
దేవాలయ పరిసర ప్రదేశాలన్నీ గ్రామకంఠం పరిధిలోనివేనని పంచాయతీ మరో మారు తీర్మానించింది.ప్రతిసారి ఆలయ పూజారి సౌందరరాజన్ దేవాలయంతో పాటు పరిసరాలన్నీ ఆలయానికే చెందుతాయని, ఇ క్కడ పంచాయతీయే లేదని వాదిస్తూ పరువు తీస్తున్నారని ఇకముందు అలా చేస్తే సహించేదిలేదన్నారు. దేవాలయంతో పాటు పరిసరాలన్నీ చిలుకూరు పంచాయతీ అనుబంధగ్రామమైన దేవల్‌వెంకటాపూర్ పరిధిలోనే ఉన్న విషయాన్ని రికార్డుల ఆధారంగా తెలుసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.260కి వ్యతిరేకంగా దేవాలయంలో నడుస్తున్న పుస్తకాల వ్యాపారాలన్నీ వెంటనే తొలగించాలని గ్రామపంచాయతీ నోటీసు జారీ చేసింది. ఆలయంలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని నిబంధన ఉన్నా అందుకు విరుద్ధంగా పూజారే పుస్తకాల వ్యాపారం చేయటంతో మరిన్ని వ్యాపారాలు తోడయ్యాయన్నారు. వాటన్నింటినీ వెంటనే తొలగించాలంటూ దేవాదాయశాఖ అధికారులకూ లేఖ రాయాలని తీర్మానించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications