వ్యభిచారం: శ్రీదేవి మాజీ డిఎస్పీ కోడలే

West Godavari Dist
భీమవరం: పోలీసులను బెదిరించి హైటెక్ వ్యభిచార వ్యాపారం చేస్తున్న శ్రీదేవి ఒక రిటైర్డు డిఎస్పీ కోడలే. హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు అరెస్టు చూపించటంలో మీనమేషాలు లెక్కించారు. రిటైర్డ్‌ డీఎస్పీ కోడలినంటూ హడావుడి చేసే యువతి ధనవంతులు ఉండే నివాస ప్రాంతంలో పెద్ద ఎత్తున హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తోందనే సమాచారంతో దాడిచేసిన పోలీసులు ఆదివారం రాత్రి ఏడుగురు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రినుంచి సోమవారం సాయంత్రం వరకు వారిని అరెస్టు చూపించకుండా పోలీసులు కాలయాపన చేయటం వెనుక లోగుట్టు ఏమిటా అనే అనుమానాలు రేగాయి.

భీమవరం ఏఎస్‌ ఆర్‌ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఫ్లాట్‌పై దాడిచేసి నిర్వహకురాలు బొబ్బనపల్లి శ్రీదేవి, మరో ఏడుగురు యువతులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు పట్టణానికి చెందిన కడలి వెంకటకృష్ణ, మద్దే శేఖర్‌, దాసం వెంకటేశ్వరరావు అనే ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. యువతుల్లో ఇద్దరు ఫ్లాట్‌లో దొరకగా మరో ఐదుగురు ఆర్టీసీ బస్టాండ్‌ లో పట్టుబడినట్లు తెలిపారు. బస్టాండ్‌లో ఉన్న యువతులు కూడా శ్రీదేవికి చెందిన వారేనని వివరించారు. వీరంతా రాజమండ్రికి చెందిన వారని అన్నారు. నిర్వాహకురాలు శ్రీదేవితోపాటు విటులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మిగతా వారిని కోర్టుద్వారా ఏలూరు స్వధార్‌ హోమ్‌కు పంపిస్తామని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా గత నెల రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న శ్రీదేవి రిటైర్డ్‌ డీఎస్పీ కోడలు అని సీఐ వివరించారు. అపార్ట్‌మెంట్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+