డిప్యూటీ కలెక్టర్ శ్రీలతకు షరతులతో బెయిల్

శ్రీలత ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా అందిన సమాచారం మేరకు గత నెల 10న ఏసీబీ అధికారులు ఏకకాలంలో చీరాల, విజయవాడల్లోని ఆమెకు చెందిన ఇళ్లల్లో తనిఖీలు జరిపి, పెద్దసంఖ్యలో దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. ఈమె బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ న్యాయస్థానంలో విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు శ్రీలత ప్రతి రోజూ ఏలూరులోని ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.












Click it and Unblock the Notifications