భర్తతో విభేదాలు రాలేదు: రంజిత

నిత్యానందస్వామితో తన సంబంధాలు పారదర్శకంగా ఉన్నాయని, అనవసరమైన గొడవ చేస్తున్నారని ఆమె అన్నది. ఆహారం అందించడం, మసాజ్ చేయడం వంటి పనులను నిత్యానందస్వామికి నిత్యం అతని గదిలో అందిస్తుంటానని ఆమె చెప్పింది. రాత్రి పొద్దుపోయేవరకు తాను ఉంటానని, అది ఆశ్రమంలోని వారందరికీ తెలుసునని అన్నది. సెక్స్ వీడియోను ఆసరాగా తీసుకుని తాను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టి పారేసింది.
కాగా, సెక్స్ వీడియోపై నిత్యానంద స్వామి ఈ నెల 18వ తేదీన వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిత్యానంద స్వామి ప్రాణాలకు ముప్పు ఉందని, కొద్ది రోజుల తర్వాతనే బయటకు రావాలని నిత్యానంద స్వామికి సలహా ఇచ్చినట్లు నిత్యానంద స్వామి ప్రెస్ కోఆర్డినేటర్ సచ్చిదానంద చెప్పారు.












Click it and Unblock the Notifications