రాయలసీమను భరించలేం: శంకర రావు

డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత మొదటి వ్యతిరేకించినవారు రాయలసీమ నాయకులేనని, ఇప్పుడు తెలంగాణతో కలుస్తామనడం సరి కాదని, అది నమ్మకద్రోహమేనని ఆయన అన్నారు. రాయలసీమ నేతలే ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించారని, ఎక్కువ కాలం రాయలసీమ నేతల ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాల నాయకులు ముఖ్యమంత్రులయ్యారని ఆయన అన్నారు.
తెలంగాణవారు ఎవరితోనూ కలవాలని కోరుకోవడం లేదని, 1956 నాటి హైదరాబాద్ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటనను సీమాంధ్ర పేరుతో వ్యతిరేకించింది రాయలసీమవాసులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications