లగడపాటీ, ఏదీ నీ తెలుగు ప్రేమ: హరీష్

నవభారత్ 95 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్తును పక్క రాష్ట్రాలకు అమ్మకుండా రాష్టానికి ఇస్తోందని, పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడానికి అనుమతి ఉన్నా రాష్ట్ర ప్రజల కోసం నవభారత్ ఆ పని చేస్తోందని ఆయన అన్నారు. తెల్లారి లేస్తే తెలుగు ప్రజలు, కలిసి ఉండాలంటూ ప్రేమ కురిపించే లగడపాటి రాజగోపాల్ మాత్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటున్నాడని ఆయన అన్నారు. కెజి బేసిన్ గ్యాస్ తో లగడపాటి రాజగోపాల్ ల్యాంకో విద్యుత్తును ఉత్పత్తి చేస్తోందని, రాష్ట్రంలోని వనరులను వాడుకుంటూ ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటూ వ్యాపార ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని ఆయన అన్నారు. వ్యాపారం, డబ్బు సంపాదన మాత్రమే లగడపాటి లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేట్ కంపెనీలకు గ్యాస్ ను కేటాయిస్తున్న ప్రభుత్వం జెన్కోకు మాత్రం కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ముఖ్యమంత్రి రోశయ్యను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications