లగడపాటి మానసిక స్థితిపై సందేహం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komitireddy Venkat Reddy
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మానసిక స్థితిపై సందేహాలు పుడుతున్నాయని తెలంగాణకు చెందిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లగడపాటి ప్రకటనలు చూస్తుంటే ఆ విధమైన అనుమానాలు వస్తున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పడితే పాకిస్తాన్ కలలు నెరవేరినట్లేనని లగడపాటి రాజగోపాల్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ ఆస్పత్రి నుంచి హైదరాబాదులోని నిమ్స్ కు లగడపాటి పారిపోయి వచ్చిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందనే అభిప్రాయం బలపడుతుంటే నిన్న మొన్నటి దాకా నక్సలైట్ల పేరు చెప్పారని, ఇప్పుడు లగడపాటి మరో కొత్త వాదన ముందు పెడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తీరుతుందని తమకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+