సెక్స్ టేప్ పై పెదవి విప్పని నిత్యానంద

సెక్స్ టేప్ పై మినహా మీడియాలో వచ్చిన పలు ఆరోపణలపై మీడియా మీద నిత్యానంద స్వామి విరుచుకుపడ్డాడు. మీడియా కథల మీద కథలు అల్లుతోందని, తమ ఆశ్రమం లోపల, వెలుపల భయం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, ప్రజలను ఆందోళకు గురి చేయాలని చూస్తోందని, ఊహాగానాలను ప్రచారం చేస్తోందని అతను విమర్శించాడు.
నిత్యానంద స్వామి ప్రస్తుతం హరిద్వార్ లోని కుంభమేళాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిత్యానంద స్వామి బీదాడి ఆశ్రమానికి భూకబ్జాకు పాల్పడినట్లు, ఆశ్రమంలో ఓ భక్తుడి హత్యలో నిత్యానంద స్వామి పాత్ర ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది తనపై మీడియాలో జరుగుతున్న కుట్ర అని అతను అన్నాడు. దీని వెనక ఎవరు ఉన్నారు, ఏం ఉందనే విషయం తనకు బోధపడడం లేదని ఆయన అన్నారు. స్వామి త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడని యూట్యూబ్ క్లిప్ లో చెప్పారు.












Click it and Unblock the Notifications