హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో దాదాపు పది రైళ్ల రాకపోకలకు శనివారం ఆంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ లో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్, తిమ్మాపూర్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బాలానగర్ లో బెంగుళూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను రాయచూర్ మీదుగా దారి మళ్లించారు.
ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా మహబూబ్ నగర్ లో ఆపేశారు. ప్రయాణికులను బస్సుల్లో హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబ్ నగర్ ప్యాసంజర్, తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరిన్ని రైళ్లను కూడా రద్దు చేశారు.