ఇటానగర్: పోలీసులు విధి నిర్వహణలో ఉండగా మందు కొట్టడడంలో తప్పేంలేదని అరుణాచల్‌ప్రదేశ్ హోంమంత్రి టాకో దాబీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారంగా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులు మద్యం సేవించరని, ఒకవేళ ముచ్చటపడి ఒక పెగ్ పుచ్చుకుంటే పెద్ద తప్పుకాదని అమాత్యులు సెలవిచ్చారు. అయితే మందు కొట్టి చెడుగా ప్రవర్తిస్తే మాత్రం తప్పేనని ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ టాకో అన్నారు. మద్యం ఎంత తాగితే అంత బలమని మంత్రిగారు ముక్తాయించారు.