రంజితతో ప్రయోగాలు చేశా: నిత్యానంద

Swamy Nityananda-Ranjitha
హరిద్వార్: సినీ నటి రంజితతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతూ వీడియోకు చిక్కిన నిత్యానంద స్వామి హరిద్వార్ లోని ఓ హోటల్లో కనిపించాడు. వీడియో టేప్ లు బయటపడినప్పటి నుంచి ఆయన మీడియాను తప్పించుకుని తిరుగుతున్నాడు. లైంగిక కార్యకలాపాల కుంభకోణంలో చిక్కుకున్న తర్వాత అతను మీడియాతో నేరుగా తొలిసారి మాట్లాడాడు. లైంగిక కార్యకలాపాల్లో తన పాత్ర గురించి అతను ఖండించాడు.

తనకు వార్తాకథనాలు వినిపించాయని, వాటికి తాను ఎంతగానో బాధపడ్డానని అతను అన్నాడు. ప్రజలు పెట్టిన బాధకు తాను శరీరానికి, మనస్సుకు తగిలిన గాయాల నుంచి బయటపడడానికి మౌనముద్రలోకి వెళ్లానని నిత్యానంద స్వామి అన్నాడు. అతను ఏప్రిల్ 2వ తేదీన శ్రీపెరంబుదూర్ లోని కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది.

తాను గానీ తన సంస్థ గానీ ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని అంతకు ముందు ఆయన యూట్యాబులో అన్నాడు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు అతను చెప్పాడు. బెడ్రూంలో తమిళ నటి రంజితతో పాటు తాను ఉన్న వీడియో టేప్ లోని దృశ్యాలు ప్రయోగాలు మాత్రమేనని అతను అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+