తెలంగాణలో బాబుకు కష్టాలే

తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలోని కాంగ్రెసు నాయకుల కన్నా తెలుగుదేశం నాయకులే గట్టిగా మాట్లాడుతున్నారు. తెలంగాణ జెఎసి కవ్వీనర్ కోదండరామ్ పై వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కోదండరామ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోదండరామ్ పై సీమాంధ్రకు చెందిన తమ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఖండించడం లేదు. కాంగ్రెసులో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ విషయంలో సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటికప్పడు తెలంగాణ కాంగ్రెసు నాయకులు తిప్పికొడుతున్నారు.
తెలంగాణను తెలుగుదేశం నాయకులు రాజకీయ లబ్ధి కోసమే వాడుకోవాలని అనుకుంటోందని, అందుకు జెఎసిని కవచంగా వాడుకుంటోందనే భావన ఉంది. జెఎసిని కవచంగా వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలపైనే తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టిందనే అభిప్రాయం ఉంది. దీంతో తెలంగాణ జెఎసి తెలుగుదేశం పార్టీపై నాలుగైదు కారణాలు చూపి బహిష్కరణకు గురి చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో పర్యటించడం అంత సులభం కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications