టిడిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవం

Mandava Venkateswara Rao
నిజామాబాద్: తెలుగుదేశం శాసనసభ్యులకు సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణవాదుల నుంచి వారు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. ఆర్మూర్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి, డిచ్ పల్లి శాసనసభ్యుడు మండవ వెంకటేశ్వరరావులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ వారు ఈ చర్యకు దిగారు.

తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో పోచారం శ్రీనివాస రెడ్డి కారు కూడా దిగకుండానే వెనుదిరిగారు. మండవ వెంకటేశ్వర రావును తెలంగాణవాదులు ఘెరావ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించినప్పుడు తాము బ్రహ్రరథం పట్టామని, ఇప్పుడు వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ జెఎసి నాయకులు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+