శాటిలైట్ టౌన్ షిప్ గా వికారాబాద్

Vikarabad
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ నియో జకవర్గంలో అణుజలాంతర్గామి(న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌) రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సముద్రజలాల్లో ఉండే జలాంతర్గాములు పంపే సంకేతాలను విశ్లేషించేందుకు ఈ రాడార్‌లు పనిచేస్తాయి. వీటి ఏర్పాటుకు పూడూరు మండలంలో 1400 ఎకరాలను కేటాయించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. ఇప్పటికే ఈ భూములను నేవీ అధికారులు పరిశీలించి సుముఖత చూపడంతో భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం చకచకా సర్వే పూర్తి చేస్తోంది. మరోవైపు బహుదూర్‌పురాలోని జాతీయ పోలీస్‌ దళం(ఎన్‌పీఏ)ను వికారాబాద్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సనత్ నగర్ లోకో షెడ్ వికారాబాద్ కు తరలి రానుంది. 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తారు.

ప్రస్తుతం ఎన్‌పీఏ ఉన్న ప్రాంతం ఐఎస్‌ఐలాంటి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్న నేపథ్యంలో ఫైరింగ్‌ రేంజ్‌ ను మదనపల్లి, పీలారం శివార్లలో ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది. 200 ఎకరాల్లో ఫైరింగ్‌ రేంజ్‌ స్థాపనకు ఎన్‌పీఏ డీజీ స్థలాలను పరిశీలించి ఓకే చెప్పడంతో భూసేకరణకు దాదాపు లైన్‌క్లియర్‌ అయినట్లే. మెహిదీపట్నంలో రైతుబజార్‌ కోసం సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా ధారూర్‌లో ఆర్మీకి 200 ఎకరాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

శాటిలైట్‌ టౌన్‌గా వికారాబాద్‌ ను అభివృద్ధి పరచాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దేశంలోని ఆరు పెద్దనగరాలకు వంద కిలోమీటర్ల పరిధిలో శాటిలైట్‌ టౌన్‌ షిప్ ‌లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున వికారాబాద్‌ను కూడా జాబితాలో చేర్చారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ తదితర సదుపాయాల కల్పనకు కేంద్రం దాదాపు రూ.100 కోట్లు వెచ్చించనుంది.దీంతో వికారాబాద్‌ రూపురేఖలు సమూలంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+