ఫ్రీజోన్ కాకపోతే తెలంగాణకూ అన్యాయం: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: హైదరాబాదును ఫ్రీజోన్ గా పరిగణించకపోతే తెలంగాణ జిల్లాలకు కూడా అన్యాయం జరుగుతుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తాను మర్యాదపూర్వకంగానే గవర్నర్ ను కలిసినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వల్ల లాభనష్టాలపై శాసనసభలో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో తన అభిప్రాయాన్ని తెలియజేస్తానని ఆయన అన్నారు.

హైదరాబాద్ ఫ్రీజోన్ కాకపోతే రంగారెడ్డి, ఇతర తెలంగాణ జిల్లాల అభ్యర్థులు కూడా పోలీసు ఉద్యోగాలకు హైదరాబాదులో దరఖాస్తు చేసుకోలేరని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదంటూ ప్రకటించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులోని నిబంధనను తొలగించడం వల్ల కలిగే లాభనష్టాలపై తెలిసి శాసనసభలో తీర్మానం చేస్తే ఫరవాలేదని, ఆ విషయాలు తెలియకుండా తీర్మానం చేయడం సరి కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తాను సమైక్యాంధ్రను సమర్థిస్తూ నాలుగో నివేదిక అందజేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+