హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత రెండు రోజులుగా అంతర్జాతీయ మీడియాకు తెలంగాణ ఉద్యమంపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికాకు చెందిన 'న్యూయార్క్ టైమ్స్' పత్రికకు బుధవారం, ఇస్లామిక్ దేశాల్లో ప్రాచుర్యం ఉన్న 'అల్ జజీరా' టీవీ ఛానల్‌కు గురువారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ సంస్కృతి, ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థులు, యువత ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. త్వరలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.