టెల్ అవీస్: గాజాపై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడులకు ప్రతిగా తాము ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు కురిపించినట్టు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇదిలావుండగా తూర్పు జెరూసలెంలో కొత్తగా నిర్మిస్తున్న యూదు నివాసప్రాంతాలకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హెబ్రాన్‌లోనూ ఇజ్రాయెల్ భద్రతాదళాలపై పాలస్తీనావాసులు రాళ్లతో దాడులు చేశారు.