నేపాల్ మాజీ ప్రధాని కొయిరాలా మృతి

నిన్నటినుంచి డయేరియాతో బాధ పడుతుండటంతో ఆయనకు ఇంట్లోనే వెంటిలేటర్లు అమర్చి చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ప్రసుత్తం నేపాల్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖాట్మండునుంచి బయటకు వెళ్లిన పార్టీ సీనియర్ నేతలందరినీ ఈరోజు అత్యవసర సమావేశానికి రావాలని పార్టీ ఆదేశాలు జారీచేయటంతో కొయిరాలా పరస్థితి విషమమని తెలిసిపోయింది. 87 సంవత్సరాల కొయిరాలా నేపాల్‌లో 240 ఏళ్ల రాజరికాన్ని అంతమొందించి ప్రజాస్వామ్య దేశంగా అవతరించటంలో ప్రధానపాత్ర పోషించారు. నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. 2007 జనవరినుంచి 2008 జులై వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మృతికి అన్ని రాజకీయపార్టీల ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications