ఆదిలాబాద్: విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న ఓ ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదిలాబాద్‌జిల్లా మంచిర్యాల ఐటీడీఏ ఆశ్రమపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజమల్లు వేధిస్తున్నాడని అదేపాఠశాలకు చెందిన విద్యార్థినులు ధర్నాకు దిగారు.
విధ్యార్ధినుల ఆరోపణలపై విచారణ చేపట్టిన ఆర్డీఓ ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రధానోపాధ్యాయుడిపై శాఖపరమైన విచారణ జరిపించే అవకాశముంది.