ఎమ్మెల్యే శంకరరావుకు బెదిరింపు కాల్స్

Hyderabad
హైదరాబాద్: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్‌ రావుకు ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సోమవారం ఉదయానికల్లా హతమారుస్తామంటూ ఒక వ్యక్తి రెండు సార్లు ఫోన్‌ చేసి హెచ్చరించాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ముషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సాయంత్రం 6.27గంటల సమయంలో 98854 10892 నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. శంకర్ ‌రావే స్వయంగా ఫోన్‌ అందుకున్నారు. అటు నుంచి ఫోన్‌ చేసిన వ్యక్తి నానా దుర్భాషలాడుతూ, ప్రతాప్‌ వెంటపడుతావా..! చంపేస్తానని హెచ్చరించాడు. అదేవిధంగా రాత్రి 8.27గంటల సమయంలో 99125 37294 నెంబర్‌ నుంచి రాగా, ఎమ్మెల్యే భార్య ఫోన్‌ అందుకున్నారు. రెండోసారి కూడా అదేవిధమైన అసభ్యపదజాలంతో హెచ్చరించాడు. కంటోన్మెంట్‌ బోర్డు చైర్మెన్‌ జంపనప్రతాప్‌ అనుచరుడైన రమేష్‌ తనకు ఈ రకమైన బెదిరింపు ఫోన్‌లు చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంటోన్మెంట్ ‌లో అన్యాక్రాంతమవుతున్న సుమా రు రూ. వెయ్యి కోట్ల విలువైన భూముల వివరాలను బయటపెట్టినందుకే జంపన ప్రతాప్‌, ఎంపీ సర్వే సత్యనారాయణ తనపై కక్షగట్టారని శంకర్ ‌రావు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. బేగంపేట విమానాశ్రమంతో పాటు, కంటోన్మెంట్‌ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న భూములపై తాను ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+