హైదరాబాద్: సీతారాముల కళ్యాణ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆయన సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇది ఎంతో మంచి రోజు అని, ముహూర్తం చేసి తన సినిమా వరుడు సినిమా విడుదలకు తేదీ ఖరారు చేసుకున్నామని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు గుణశేఖర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
సీతారాముల కళ్యాణాన్ని మించిన వైభవం లేదని గుణశేఖర్ అన్నారు. ఈ కళ్యాణాన్నే తమ సినిమాలో ఐదు రోజుల పెళ్లి వేడుకగా చూపించామని ఆయన అన్నారు.