శ్రీనగర్: భారత సైన్యం బుధవారం భారీ చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. సరిహద్దుకు కాపలాగా ఉన్న బలగాలు కెరాన్ సెక్టార్లో చొరబాటుదార్ల కదలికలను గమనించారని, చొరబాటుదార్లపై బలగాలు కాల్పులు జరిపాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
భారత బలగాలపై మిలిటెంట్లు ఎదురు కాల్పులు జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారని ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి.