ఎసిబి దాడులు: అరవింద రావు వర్సస్ కెసిఆర్

Aravinda Rao-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ అరవింద రావును లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ వ్యవహారం అరవిందరావుకు, కెసిఆర్ మధ్య సంఘర్షణగా దారి తీసే అవకాశం ఉంది. ఇటీవల ఎసిబి దాడులు అధికారులు, రాజకీయ నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టును ఎసిబి విప్పుతోంది. కోట్లాది రూపాయలు కూడబెట్టిన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఎసిబి దాడులు నిర్వహిస్తోంది. ఈ అధికారులకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడంతో మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా, ఎసిబి దాడుల వ్యవహారం ప్రాంతీయ లక్షణాన్ని సంతరించుకుంటోంది.

అరవిందరావుపై కెసిఆర్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను లక్ష్యంగా ఎంచుకుని దాడులు నిర్వహించేందుకు ఎసిబి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. అరవిందరావు ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన స్వామి గౌడ్, విఠల్ వంటి నాయకుల ఇళ్లపై ఎసిబి దాడులు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు అరవింద రావు సారథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య పథకం రచించారని ఆయన విమర్శించారు. రోశయ్యకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులపై ఎసిబి దాడులు జరిగితే సహించబోమని ఆయన హెచ్చరించారు.

కాగా, కెసిఆర్ ఆరోపణలను అరవింద రావు తోసిపుచ్చారు. బాధ్యత గల నాయకుడు అలాంటి ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కచ్చితమైన ఆధారాల మేరకే అవినీతి అధికారుల ఇళ్లపై తాము దాడులు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమకు ప్రాంతీయ వాదాలు అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+