వైభవంగా సీతారాముల కళ్యాణం

కళ్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా 12 గంటలకు కళ్యాణం జరిగింది. రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలో భాగంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధీ సేవ నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications