పెళ్లికి ముందు సెక్స్ సరి కాదు: వెంకయ్య

Venkaiah Naidu
హైదరాబాద్: పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. పెళ్లికి ముందు సహజీవనం తప్పు కాదన్నది సుప్రీంకోర్టు తీర్పు కాదని, కేవలం వ్యాఖ్య మాత్రమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దేశానికి నైతిక విలువలున్నాయని, వాటి ప్రకారమే నడుచుకోవాలని ఆయన అన్నారు. పాశ్చాత్య సంస్కృతితో భారతదేశాన్ని ముడిపెట్టడం సరి కాదని ఆయన అన్నారు.

సహజీవనం చట్టపరంగా తప్పు కానప్పటికీ భారతీయ సంప్రదాయాలకు, అచారాలకు విలువ ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో ఈ సంప్రదాయం ఉన్నప్పటికీ భారతీయులు దాన్ని స్వాగతించరని ఆయన అన్నారు. తెలంగాణపై కాలయాపన కోసమే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన విమర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+